నగరంలో గురువారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన సమాచారం మేరకు.. దంపతులు ఇద్దరు ప్రగతి ఆసుపత్రికి వచ్చి వెళ్తున్న క్రమంలో పక్కనే ఉన్న టీ తాగుతున్నారు.
ఈ క్రమంలో ఒక ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని దుండగులు రాంగ్ రూట్ లో వచ్చి మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు తెంపుకుని పరారయ్యారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని వెంబడించినప్పటికీ దుండగులు తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
