తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు శ్రీ గడుగు గంగాధర్ గారి నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా గడుగు గంగాధర్ గారిని, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గణేష్ బిగాల గారు, ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు.
అగ్నిప్రమాదం కారణంగా దగ్ధమైన ఇంటిని పరిశీలించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సిర్ప రాజు,ప్రభాకర్ రెడ్డి , సత్యప్రకాష్, సుజిత్ సింగ్,దండు శేఖర్,జగత్ రెడ్డి, ప్యాట సంతోష్,నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు పాల్గొన్నారు.
