దాదాపు రెండున్నర యేళ్ళ తర్వాత బిఆర్ యస్ పార్టీ ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా వ్యవహరించింది. అధికారం కోల్పోయాక కాకా వికాలం అయినా ఆ పార్టీ కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. లోకసభ మున్సిపల్ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఆ పార్టీ సంస్థాగతంగా కొలు కోలేని దెబ్బ తీశాయి.
ద్వితీయ శ్రేణులు పెద్ద సంఖ్యంలోనే అధికార పార్టీలోకి జంప్ అయ్యారు ఓడిన ఎమ్మెల్యే లుకూడా వలసలకు బ్రేక్ వెయ్యలేక నిస్సహాయులయ్యారు అసలు వారే పార్టీ ని క్యాడర్ ను గాలికి వదిలేసి హైదరాబాద్ కు పరిమితం అయ్యారు పార్టీ అధిష్టానం కూడా సంస్థాగత ప్రక్షాళన వైపు దృష్టి సారించలేక పోయింది.
సర్పంచ్ మున్సిపల్ ఘోర పరాజయం ఎదుర్కొంది.కానీ అధికారం కోల్పోయిన రెండున్నర ఏళ్ల తర్వాత పార్టీ పటిష్టత కోసం ఎట్టకేలకు అధినేత స్వయంగా రంగంలోకి దిగారు సభ్యత్వ నమోదు కోసం కార్యాచరణ ఖరారు చేసారు దీనితో ఒక్కసారిగా పార్టీ క్యాడర్ కొంత మేరకు కదలిక వచ్చింది జిల్లాలో ఇప్పటికే సభ్యత్వ నమోదు కు సంబంధించి నియోజకవర్గ సమావేశాలు గులాబీ శ్రేణుల్లో.
ఉత్తేజం కలిగించింది. ఈ సమావేశాలు వెంటనే రైతులను ఇబ్బంది పెడుతున్న యూరియా యాప్ అంశం ను తెరమీదికి తెచ్చింది. యూరియా యాప్ ఫై క్షేత్రస్థాయిలో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అందుకే యూరియా యాప్ ను అస్రంగా చేసుకొని ఆందోళనకు సిద్ధం అయింది రద్దు చేయాలనీ, రైతులకు ఎకరానికి నాలుగు సంచుల యూరియాను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఒకేసారి పంపిణీ చేయాలని మరియు సొసైటీలో షాపుల్లో సరిపడా యూరియా విరివిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ రైతు ఆందోళనకు దిగింది జిల్లాలో ని ఇప్పటికే అన్ని సెగ్మెంట్ ల్లో ఆందోళన లు జరిగాయి
బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేల్పూర్ X రోడ్ లో జాతీయ రహదారి మీద భారీ ధర్నా, రస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.నిజానికి యాప్ ఇప్పటికే జిల్లాలో ఆయా ప్రాంతాల్లో యాప్ వద్దంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు .
అంక్సాపూర్ గ్రామంలో ప్రారంభమైన ఈ నిరసన లు మోర్తాడ్, తిమ్మాపూర్, ధర్మోరా, వేల్పూర్,డొంకల్, మెండోరా, కమ్మర్‌పల్లి, బడా భీమ్‌గల్ వంటి అనేక గ్రామాల్లో జరిగాయి జిల్లాలో మొత్తం 3 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే 4 లక్షల యూరియా సంచులను పంపిణీ చేశారని, అంటే ఒక్కో రైతుకు రెండు సంచులు కూడా సరిగా అందలేదు .
మిగిలిన 1.5 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు ఒక్క సంచి కూడా అందలేదని బిఆర్ యస్ నేతలు చెప్తున్న వాదన జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ఎకరానికి కనీసం 4 సంచుల చొప్పున లెక్కించినా ఒకే పంట కాలానికి 24 లక్షల సంచుల యూరియా అవసరమవుతుందని గుర్తుచేశారు.
ఇప్పటివరకు 4 లక్షల సంచులు మాత్రమే ఇచ్చి, ఇంకా 20 లక్షల సంచుల కొరత ఉండగా స్టాక్ ఫుల్ ఉందనిచెప్పడాన్ని గులాబీ నేతలు ఎండ గడుతున్నారు
