HomePOLITICAL NEWSAndhra Pradeshఅగ్ని కి ఆహుతి అయిన బస్సు ……పది మంది సజీవ దహనం

అగ్ని కి ఆహుతి అయిన బస్సు ……పది మంది సజీవ దహనం

ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలోగురువారం తెల్లవారుజామున బస్సు అగ్ని కి ఆహుతి అయింది . ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు వచ్చాయి.


హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు రెండు వాహనాలకు వ్యాపించాయి.

మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ప్రయాణికులు తమ సీట్ల నుండి లేచి బయటకు వచ్చే లోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు.

కొందరు కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకుపోయిన 10 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు .మరో వైపు ఏపీ ప్రభుత్వం ఈ ఘటన ఫై విచారణ కు ఆదేశించింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments