కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ ఆసుపత్రి ఎదుట రాంగ్ రూట్లో కారు అతివేగంగా దూసుకు వచ్చి రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన రెడ్డి టిఫిన్ సెంటర్, జయ హాస్పిటల్ వద్ద పార్కింగ్ ఉన్న బైకులను ఢీకొడుతూ వెళ్ళింది.
ఈ సంఘటన లో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులపై కారు దూసుకు వెళ్లడంతో పక్కకు ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. కారు అతివేగంగా దూసుకు వెళ్లడంతో టిఫిన్ సెంటర్ పక్కన నిలిపి ఉన్న అంబులెన్స్ ఢీకొని కారు ఆగిపోయింది. లేకపోతే టిఫిన్ సెంటర్ లోపల ఉన్న వ్యక్తులపైకి కారు దూసుకొని వెళ్లి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ సుల్తానా,ఆహన్ అనే రెండు సంవత్సరాల బాబు,మరో వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణం కారు నడుపుతున్న వ్యక్తి జగదీష్ ఫుల్ గా మద్యం సేవించి ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
జగదీశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వాసిగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
