HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ లో... ఘనంగా శాంతి ర్యాలీ - జెండా ఊపి ప్రారంభించిన అధ్యక్షుడు రమేష్ జాన్-...

ఆర్మూర్ లో… ఘనంగా శాంతి ర్యాలీ – జెండా ఊపి ప్రారంభించిన అధ్యక్షుడు రమేష్ జాన్- అంబేద్కర్ విగ్రహానికి నివాళులు – అంబేద్కర్ చౌరస్తా నుండి పెర్కిట్ వరకు కొనసాగిన ర్యాలీ

ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన పీస్ వాక్ ర్యాలీ ఆర్మూర్ పట్టణంలో ఘనంగా కొనసాగింది. ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీ సిఎస్ఐ చర్చ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం వందలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు ప్రయాణిగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడనుండి మామిడిపల్లి చౌరస్తా మీదుగా సక్కి హాస్పిటల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ జాన్ మాట్లాడుతూ.. క్రీస్తు పునరుత్థాన శాంతి సందేశాన్ని అందించేందుకు క్రైస్తవులు తరలిరావడం అభినందనీయమన్నారు. క్రీస్తు ప్రేమ వార్తను ప్రకటిస్తూ ఆయన చూపిన శాంతి మార్గాన్ని అవలంబించాలన్నారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సఖి హాస్పిటల్ రాజు ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజ్ పాల్ దినకర్, కోశాధికారి మధు, కార్యవర్గ సభ్యులు ఇమ్మానుయేలు, కృప సత్యం, డేవిడ్, దైవ చిత్తం, హెప్సిబా, అగస్టీన్, శ్రీనివాస్,ఆనంద్ పాల్, ప్రభుదాస్, సునీల్, ప్రసాద్, జాన్ పీటర్, పరిమల్ రాజ్, జీజిరామ్, రాజు లతోపాటు పలువురు నాయకులు క్రైస్తవులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments