HomeHEALTHక్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

రాబోయే తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆడబిడ్డలకు క్యాన్సర్ ముప్పు తప్పించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త పిలుపునిచ్చారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల సురేష్ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను శనివారం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, 20వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజుతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 9 నుండి 14 ఏళ్ల లోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకకుండా ఈ వ్యాక్సిన్ రక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో అల్లు అర్జున్ అభిమానులు ముందుండటం అభినందనీయమని కొనియాడారు.

కార్పొరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ.. ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాల వల్ల సామాన్య ప్రజలకు వ్యాక్సినేషన్ పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు.కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడు: నరేందర్, ఉపాధ్యక్షులు, దీపక్, మహేష్, సెక్రటరీ:గోపి, జాయింట్ సెక్రటరీ:

బబ్లు, కృష్ణ, ముఖ్య సభ్యులు: కార్తీక్ ఇతర అభిమాన సంఘం నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments