ఇంట్లో ఉన్న ఓ మహిళపై దాడి చేసి, గుర్తు తెలియని దొంగ, మహిళ మెడలో నుంచి నగలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
పోలీసులు,బాధిత కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బిక్కనూరు మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా లో వారంతపు సంతలో, ఆదివారం రోజు చౌరస్తా వద్ద వారాంతపు సంత జరుగుతుండడం,గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూర గాయలు తీసుకోవడానికి విపరీతమైన జనాలతో గుమ్మకూడి ఉన్నారు.
ఇదే అదనుగా భావించిన ఓ గుర్తు తెలియని దొంగ, అదే కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఉప్పరి లక్ష్మి అనే మహిళ తన ఇంటి వద్ద ఒంటరిగా ఉండడాన్ని గమనించిన గుర్తుతెలియని దొంగ, మహిళ ఇంట్లోకి చొరబడి రోకలి బండతో మహిళ తలపై బాధి, మహిలో మెడలో ఉన్న బంగారం ఎత్తుకొని అక్కడినుండి పారిపోయాడని స్థానికులు తెలిపారు.
ఇంట్లో నుండి మహిళ గట్టిగా అరుస్తూ ఉండడం గమనించిన స్థానికులు మరియు కూరగాయలు కొనడానికి వచ్చిన జనాలు ఇంట్లోకి వెళ్లి చూడగా, మహిళ తల పగిలి విపరీతమైన రక్తం కారుతూ కనిపించింది.
వెంటనే అక్కడ ఉన్న జనాలు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ ఆసుపత్రికి మహిళను తరలించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందని, త్వరలోనే దర్యాప్తు చేపడుతామని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
