సెల్ ఫోన్ పోయిందంటూ. పోలీస్ స్టేషన్కు వచ్చి న బాధితుడే చైన్ స్నాచింగ్ కు పాల్పడి నట్లుగా తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. తాగిన మైకం లో ఉన్న నిందితుడి చోరి ఘనకార్యం చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగి చోరీ సొత్తు ను సైతం రికవరి చేసారుఆదివారం
రాత్రి పట్టణానికి చెందిన స్వామి అనే పాన్ షాప్ యజమాని తన ఫోన్ పోయిందని అదే బిక్కనూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. మొదట బాధితుడి పిర్యాదు ను సీరియస్ గానే తీసుకున్న పోలీసులకు అనుమానం వచ్చి ఏం జరిగిందో నిజంగా చెప్పాలని, గట్టిగా బెదిరించాడు.
తాను లక్ష్మి అనే మహిళా మెడలో నుంచి మూడు తులాల గొలుసుకూడా కాజేసానని కూడా ఒప్పుకొని, హైవే పక్కన ఒక వెంచర్ లో గొయ్యి తీసి బట్టలో దాచి పెట్టానన్నాడు అదే రాత్రి పాతిపెట్టిన స్థలానికి తీసుకెళ్లారు. పోలీసులు దాచిపెట్టిన బంగారాన్ని రికవరీ చేసుకున్నారు.
కేవలం రెండు గంటల వ్యవధిలో భిక్కనూరు పట్టణ నడిబొడ్డున నివాసం ఉంటున్న ఉప్పరి లక్ష్మీ దొంగతనం కేసును చేధించారు. కల్లు తాగిన మైకం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డానని, చెప్పాడు
