HomeCRIMEఖద్దరు మాటున మూడుముక్కలాట'..!పేకాట శిబిరంలో భైంసా మున్సిపల్ చైర్మన్!పెర్కిట్ శివారులో పోలీసుల మెరుపు దాడి ఆరుగురు...

ఖద్దరు మాటున మూడుముక్కలాట’..!పేకాట శిబిరంలో భైంసా మున్సిపల్ చైర్మన్!పెర్కిట్ శివారులో పోలీసుల మెరుపు దాడి ఆరుగురు అరెస్ట్.. రూ. 1.80 లక్షల నగదు స్వాధీనం

తిరుమల గార్డెన్ నిర్వాహకుడిపైనా కేసు నమోదు..నీతులు చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు నిలువునా దొరికిపోయారు. చట్టాన్ని గౌరవించాల్సిన పదవుల్లో ఉండి.. పేకాట స్థావరాల్లో తీన్ పత్తీ ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులోని తిరుమల గార్డెన్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో భైంసా మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల దత్తాద్రి, ఆర్మూర్ 25వ వార్డు కౌన్సిలర్ మెడిదల వెంకట గౌడ్ (రవి గౌడ్)తో పాటు మరో నలుగురు ప్రముఖులు పోలీసులకు చిక్కడం నియోజకవర్గంలో కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తిరుమల గార్డెన్ నిర్వాహకుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఇక్కడ పేకాట శిబిరం నడుస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో భైంసా, నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వ్యూహాత్మకంగా గార్డెన్‌ను చుట్టుముట్టారు. పోలీసులను చూడగానే జూదరులు పరారయ్యేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో భైంసా మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల దత్తాద్రితో పాటు ఆర్మూర్ కౌన్సిలర్ మెడిదల వెంకట గౌడ్, జక్రాన్ పల్లి మండలం తొర్లికొండకు చెందిన కల్లు వ్యాపారి రత్నగిరి శంకర్ గౌడ్, నిర్మల్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సుంకరి మహేష్, మాదారపు అభిలాష్, భైంసాకు చెందిన సయ్యద్ ఆసిఫ్ ఉన్నారు. నిందితుల వద్ద నుంచి **రూ. 1,79,940** నగదుతో పాటు, నిందితులు వచ్చిన టయోటా ఇటియోస్ (TS 09 FR 4975) కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూదగాళ్లతో పాటు పేకాట స్థావరాన్ని నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ పై కూడా పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి జూదం ఆడుతూ పట్టుబడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments