బాన్సువాడ పట్టణంలోని న్యూ వీక్లీ మార్కెట్ సమీపంలో కొత్తగా నిర్మాణం అవుతున్న భవంతిలో 30 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన మహిళా మృతదేహం మరియు 6 నుంచి 8 సంవత్సరాలు కలిగిన బాలుడు మృతదేహాలను ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తించినట్లు అమృతదేహాలు కుళ్ళిపోయి ఉన్నాయి అని బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని కుళ్లిపోయిన రెండు మృతదేహాలను న్యూ వీక్లీ మార్కెట్ దగ్గరలోని కొత్తగా నిర్మాణం అవుతున్న భవనంలోని ఒక షెటర్లో ఒక మహిళ మరియు ఒక బాలుడు చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు వచ్చి చూడగా మహిళ మరియు బాలుడు మృతి చెంది మూడు నుంచి నాలుగు రోజులు అయ్యి ఉండవచ్చునని తెలియజేయుచున్నది.
మృతి చెందిన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఒంటిపై లేత గోధుమ రంగు టాప్ మరియు నలుపు రంగు పాయింటు దుస్తులు ధరించి, ఎత్తు ఐదు ఫీట్ల పొడవు కలిగి ఉన్నాడని మరియు బాలుడు ఆకుపచ్చ టీ షర్ట్ మరియు కాషాయం రంగు కలిగిన నిక్కర్ ఉన్నదని తెలిపారు.
మృతదేహాలను బాన్సువాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. ఎవరైనా మృతదేహాల వివరాలు తెలిసినవారు బాన్సువాడ పట్టణ సీఐ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
