Saturday, April 18, 2026
HomeCRIMEగ్రామాభివృద్ధి కమిటీ నా స్థలాన్ని కబ్జా వేయాలని ప్రయత్నం….

గ్రామాభివృద్ధి కమిటీ నా స్థలాన్ని కబ్జా వేయాలని ప్రయత్నం….

గ్రామాభివృద్ధి కమిటీ స్థలాన్ని కబ్జా వేయాలని ప్రయత్నం చేస్తోందని డాక్టర్ కే అశోక్ ద్వజమెత్తారు.ఆదివారం నిజామాబాద్ నగరంలో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ కే అశోక్ పాల్గొని మాట్లాడారు.డిచ్పల్లి బస్టాండ్ నడిపల్లి శివారు లోగల సర్వేనెంబర్ 235 కాశీ విశ్వనాథ ఆత్మ లింగేశ్వర ఆలయానికి సంబంధించిన స్థలం 30 గుంటలను గతంలో కొన్నాను .

ఆట్టి స్థలాన్ని స్థానిక అధికారుల అబ్జెక్షన్ చేయగా హైకోర్టులో కేసు వేయడం జరిగిందనీ అయన తెలిపారు. అందుకు హైకోర్టు ఆ స్థలము ఆలయానికి సంబంధించినది తేల్చి చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. అట్టి స్థలంలో ఆలయం నిర్మాణం పూర్తయినందున ఆలయానికి సంబంధించిన ఫోటోలు పత్రాలను కలెక్టర్ చేసిన సర్వే రిపోర్ట్ లు ఆలయ రిజిస్టర్ కు సంబంధించిన పత్రాలు అవసరం ఉన్నందున సబ్ రిజిస్టర్కు దాఖలు చేశానని తెలిపారు. శనివారం సాయంత్రం సమయంలో ఆలయానికి వెళ్లానని తెలిపాడు.

అందుకు డిచ్పల్లికి చెందిన గంగాధర్ మందితో కలిసి ఆలయానికి వచ్చారు ఆలయ గ్రామాభివృద్ధి కమిటీని తామే నిర్మించామని ఆరోపిస్తూ చంపుతానని బెదిరించాడు రిజిస్టర్ పేపర్లు తీసుకొచ్చి ఇవ్వాలని లేదంటే ఊరుకోమాటో దాడి చేసేందుకు ప్రయత్నించారు అంతేకాకుండా ఆలయం పక్కన ఉన్న మా సొంత స్థలమైన 2500 గజాల స్థలం కూడా కాజేయాలని వారు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

గతంలో చాలాసార్లు అధికారులకు గ్రామాభివృద్ధి కమిటీపై ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. నాకు ప్రాణహాని ఉన్నందున జిల్లా పోలీస్ కమిషనర్ చట్టంతే వారిపై చర్యలు తీసుకోగలరని మనవి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!