ఇందూరు: హిందూ సంస్కృతిని కాపాడటం ప్రతి హిందువు బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని కంఠేశ్వర్ ఆలయం లో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సమాజంలో కొన్నిసార్లు చిన్న విభేదాలతో కులం , ప్రాంతం, భాష మనల్ని విడదీస్తున్నాయన్నారు.
ఇవి హిందూ సమాజానికి బలహీనతలు కావాలి అన్నారు. అలాగే ఆర్ ఎస్ ఎస్ నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాల్లో వక్తలు చెబుతున్న మాటలను శ్రద్ధగా విని పాటించాలన్నారు.
కార్యక్రమంలో వక్త కల్పగురి ప్రభుకుమార్, పలుగుట్ట ఆశ్రమ కేదారానంద స్వామీజీ, సేవికా సమితి బౌద్ధిక్ ప్రముఖ్ కల్పన, హిందూ సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగోళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.
