ప్రముఖ వ్యాపార వేత్త కోల రామ్ గుప్తా మంగళవారం మృతి చెందారు .ఆయిల్ మిల్లర్ల సంఘం శాశ్వత అధ్యక్షులుగా, నిజామాబాద్ గోశాల కమిటీ సభ్యులుగా, కిషన్ గంజ్ వ్యాపారుల సంఘం జీవితకాల అధ్యక్షులుగా, అలాగే అయ్యప్ప దేవాలయం ట్రస్ట్ సభ్యులుగా కొనసాగుతున్నారు.
వ్యాపార వర్గాలకు ఏ చిన్న కష్టం వచ్చిన అండగా వుంటారు. ఆయన మొదట ఆయిల్ మిల్ ఆతర్వాత రైస్ మిల్ వ్యాపారం లో కి వచ్చారు.
తెల్లవారు నాలుగంటలకు మృతి చెందారు ఆయన మృతి చెందిన విషయం తెల్సి పలువురు వ్యాపారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళి లు అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
