నగర శివారులోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. లక్ష్మీ ప్రియా నగర్ కాలనీలో సోమవారం నిర్వహించిన ఈ మెరుపు దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం..నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కి అందిన ముందస్తు సమాచారం మేరకు, సీసీఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వలీ పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయారు.
లక్ష్మీ ప్రియా నగర్ కాలనీలోని ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని నిర్ధారించుకున్న సిబ్బంది, ఒక్కసారిగా అక్కడ దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. రూ. 33,010 నగదు. 6 మొబైల్ ఫోన్లు. ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నరు.
తదుపరి చర్యలు పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు మరియు ఫోన్లను తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓ కు అప్పగించారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
