HomeTelanganaNizamabadపదో తరగతి విద్యార్థులకు సన్మానం

పదో తరగతి విద్యార్థులకు సన్మానం

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన గంట హర్షిణి గౌడ్ 600 మార్కులకు గాను 541 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ నాయకుడు గంట సతీష్ గౌడ్ విద్యార్థులను అభినందించారు. తన కుమార్తె హర్షిణి గౌడ్ చక్కని ఫలితాలు సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ..విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల నిరంతర కృషి, పర్యవేక్షణ దాగి ఉందని కొనియాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments