రాష్ట్ర బీసీ డెవలప్‌మెంట్ కమిటీ సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు నియామకం పట్ల నిజామాబాద్ జెండా గుడి చైర్మన్ లవంగం ప్రమోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడే వీహెచ్‌కు తగిన గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు.బీసీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, అనుభవజ్ఞుడైన హనుమంతరావును
ఈ పదవికి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఈ నియామకం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
వీహెచ్ తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో బీసీల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వారధిలా పని చేస్తారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
