అలీసాగర్ ఫిల్టర్ బెడ్ పరిశీలన నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నగరానికి నీటిని సరఫరా చేసే అలీసాగర్ ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఫిల్టర్ బెడ్ వద్ద జరుగుతున్న నీటి శుద్ధి ప్రక్రియను, సరఫరా విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వేసవి నేపథ్యంలో నగరంలోని అన్ని డివిజన్లకు తాగునీరు సక్రమంగా అందేలా చూడాలని, ఎక్కడైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
నీటి నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, క్లోరినేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల నీటి అవసరాలను తీర్చాలని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యనిర్వాహక ఇంజనీర్ , సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు ఇతర పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.
