HomeTelanganaNizamabadపదో తరగతి ప్రతిభావంతులకు సన్మానం చేసిన ఉప సర్పంచ్ మంజుల రమేష్ గౌడ్

పదో తరగతి ప్రతిభావంతులకు సన్మానం చేసిన ఉప సర్పంచ్ మంజుల రమేష్ గౌడ్

భవానిపేట పాఠశాల విద్యార్థుల ఘనతభవానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 2025-26 విద్యాసంవత్సరానికి గానూ 500కు పైగా మార్కులు సాధించిన ఏడుగురు ప్రతిభావంతులను సోమవారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా సత్కరించారు.

గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ మంజుల రమేష్ గౌడ్ విద్యార్థులకు మెమెంటోలు అందజేసి, శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. ఒకే పాఠశాల నుంచి ఏడుగురు విద్యార్థులు 500 పైచిలుకు మార్కులు సాధించడం గర్వకారణమని కొనియాడారు.

విద్యార్థుల వెనుక ఉపాధ్యాయుల కఠోర శ్రమ దాగి ఉందంటూ అధ్యాపక బృందాన్ని అభినందించారు. కాగా, పరీక్షలకు ముందు విద్యార్థులకు ‘ఎగ్జామ్ ప్యాడ్ల’ను కూడా పంపిణీ చేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments