నిజామాబాద్ మార్కెట్ యార్డు లో సెక్యూరిటీ తాగిన మైకం లో వీరంగం చేస్తున్నాడు ముఖ్యంగా మహిళా సెక్యూరిటీ గార్డు లకు రాత్రి పూట ఫోన్ లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు ఈ విషయమై మహిళా సెక్యూరిటీ గార్డు లు మార్కెట్ కమిటీ చైర్ మెన్ ముప్ప గంగారెడ్డి సెక్రెటరీ లను తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తాగిన మైకం తరుచు తమ కు ఫోన్ లు చేసి ఇష్ట రీతిన మాటాడుతున్నాడని వారు పేర్కొన్నారు దీనితో అంతర్గత విచారణ చేసి సదురు సెక్యూరిటీ గార్డు ను తొలగించాలని నిర్వహణ సంస్థ ను ఆదేశించారు. కానీ అధికార పార్టీకి చెందిన మరో కీలక నేత ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చారు.
సదురు సెక్యూరిటీ గార్డు మీద చర్య తీసుకోవద్దంటూ ఛైర్మెన్ మీద ఒత్తిడి తేవడంతో వెనక్కి తగ్గారు. యధావిధిగా విధులు కేటాయించడంతో మహిళా గార్డు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
