HomeTelanganaNizamabadరాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి.. పశ్చిమ బెంగాల్, అస్సాం తరహాలోనే తెలంగాణలోనూ డబుల్...

రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి.. పశ్చిమ బెంగాల్, అస్సాం తరహాలోనే తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే వేగవంతమైన ప్రగతి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ అన్నారు.

జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ నాయకుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు.

ఎంపీ ధర్మపురి అర్వింద్ నేతృత్వంలో జిల్లా నుంచి సుమారు 15 వేల మంది కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఈజీఎస్ నిధులతో కలిపి మొత్తం ₹2,20,000 ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా పైసా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల కోసం కేంద్రం పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫ్రీజ్ చేసి, తన ఖజానా అవసరాలకు మళ్లించుకుంటోందని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ ఫలితాలను చూసి ప్రస్తుత ‘రేవంత్ ఉద్దీన్’ ప్రభుత్వం వణికిపోతోందని, అందుకే లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.2016లో బెంగాల్‌లో 3 సీట్లు ఉన్న చోట, నేడు 200 పైగా సీట్లు సాధించాం.

అదే తరహాలో తెలంగాణలోనూ ప్రస్తుతం ఉన్న 8 సీట్ల నుంచి వచ్చే ఎన్నికల్లో 100కు పైగా (సెంచరీ) స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మోదీ సభను జయప్రదం చేయాలని కోరారు.

ఈ మీడియా సమావేశంలో నాయకులు పోతన్ కార్ లక్ష్మీనారాయణ, నగ్గోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ప్రమోద్ కుమార్, నాయిడి రాజన్న, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, బీలోజి నాయక్, అనంతరెడ్డి, పడాల భూపతి, అంబదాస్ రావు, పసునూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments