కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు అనగా శుక్రవారం మన జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలైన మోర్తాడ్, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి మరియు సిరికొండ మండలాలలోని వరి కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా పరిశీలించడం జరిగింది.
పరిశీలన సందర్భంగా ఎక్కడైనా వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలు ఉన్నచో వాటిని వెంటనే గుర్తించి, ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధిత Boiled రైస్ మిల్లులకు తరలించడం జరిగింది.
అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు, ధాన్యం రక్షణ చర్యలు మరియు తరలింపు ప్రక్రియలను స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోంది.డీ.ఎస్.ఓ శ్రీకాంత్ రెడ్డి
