మండల పరిధిలోని భవానిపేట తండాలో త్వరలో నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ జగదంబ మాత, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, శ్రీరామ రావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి భారీ విరాళం అందింది.
శుక్రవారం భవానిపేట ఉపసర్పంచ్ రమేష్ గౌడ్ ఆసన్న జగదంబ మాత ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 10,116 రూపాయల నగదును ఆలయ కమిటీకి అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, తండావాసులు రమేష్ గౌడ్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇలాంటి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
రమేష్ గౌడ్, వారి కుటుంబంపై జగదంబ మాత దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు తండావాసులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
