HomeTelanganaNizamabadఐదుగురి కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

ఐదుగురి కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న ఐదు కో-ఆప్షన్ సభ్యుల స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికలో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికైన వారిలో నరేందర్ సింగ్, కల్లెడ అశోక్, బొబ్బిలి మాధురి, మహమ్మద్ ముజుద్దీన్, ఉజ్మా తరన్నం ఉన్నారు. నగర అభివృద్ధిలో పోషించే ఈ ఐదుగురు సభ్యుల ఎంపికపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఈ ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎన్నికైన సభ్యులను మేయర్ కూరగాయల ఉమా రాణి అభినందించారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు సమన్వయంతో పనిచేసి నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.ఎన్నికైన సభ్యులకు కార్పొరేటర్లు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments