HomeCRIMEస్టేషన్ ఆవరణలోనే విలేకరులు - రైస్ మిల్లర్ పరస్పరం దాడులు..

స్టేషన్ ఆవరణలోనే విలేకరులు – రైస్ మిల్లర్ పరస్పరం దాడులు..

సిరికొండ మండలంలోని ప్రముఖ పత్రికలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు రిపోర్టర్లు ఏకమై, జై గురు రైస్ మిల్ యజమానికి ఫోన్ చేశారు. “మేమంతా ఒకే చోట ఉన్నాం.. నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి” అంటూ హుకుం జారీ చేశారు.

అయితే, తాను ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఉన్నానని, ఇప్పుడు రావడం కుదరదని యజమాని సున్నితంగా తిరస్కరించారు. సదరు విలేకరులు పదే పదే ఫోన్ చేస్తూ ఆయనను తీవ్రంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫోన్ కట్ చేసినా వదలకుండా, చివరకు ఫోన్లోనే అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, బెదిరింపులకు దిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రిపోర్టర్ల వేధింపులు మితిమీరడంతో, భరించలేకపోయిన రైస్ మిల్ యజమాని నేరుగా సిరికొండ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న రిపోర్టర్లు.. “మాపైనే ఫిర్యాదు చేస్తావా?” అంటూ స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి, స్టేషన్ ప్రాంగణంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేసి, పరస్పరం కౌంటర్ కేసులు నమోదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments