ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ పదవుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 25న (సోమవారం) నిర్వహించనున్నట్లు నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా మైనారిటీ సెల్ పరిశీలకులు మహమ్మద్ మోయిన్ సోమవారం నిజామాబాద్‌కు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పదవులపై ఆసక్తి ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం 11:00 గంటల నుండి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి (డీసీసీ ఆఫీస్) విచ్చేసి, తమ పూర్తి బయోడేటా వివరాలతో కూడిన దరఖాస్తులను పరిశీలకులకు సమర్పించాలని కోరారు.
నిర్దేశిత సమయంలోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.
