HomeTelanganaNizamabadఅర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి .. కాంగ్రెస్ లో పదవులే ముఖ్యం..ప్రజా సమస్యలు కాదు.. కేంద్రం...

అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి .. కాంగ్రెస్ లో పదవులే ముఖ్యం..ప్రజా సమస్యలు కాదు.. కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్నాయి.. రాష్ట్రం నుంచి సున్నా.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి.. లేదా రాజీనామా చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. జిల్లాపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ప్రజలను మభ్యపెడుతూ ముందుకు సాగుతుందన్నారు.

వైఎస్ఆర్, డీఎస్ మాదిరిగా.. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ జోడీ లక్కీ అంటున్నారు కానీ..కేవలం జేబులు నింపడానికి జోడీ కలిసిందన్నారు. అర్బన్ విషయంలో అనేక సార్లు మంత్రులను, అధికారులను కలిసి వినతులు అందించినా..లాభం లేకుండా పోతుందన్నారు.

ప్రభుత్వ పెద్దలు జిల్లాలో అనేక మంది ఉన్నా..నిధులు తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కు వోఆర్ఆర్ మంజూరు చేశారు కానీ నిజామాబాద్ పై చిన్నచూపు ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి ఓఆర్ఆర్ తీసుకొస్తానంటూ ప్రకటించారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్దే.. పిసిసి ప్రెసిడెంట్ జిల్లా వాసి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు, చైర్మన్లు ఉన్నారు..రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన వ్యక్తే అయినా … నగరానికి రింగురోడ్డు తేలేకపోయారని విమర్శించారు. సీఎం వైయస్సార్ సమయంలోనే జిల్లాకు 52 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఏళ్లు గడుస్తున్న పూర్తి కావడం లేదు అన్నారు.

కేవలం 11 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును 12 ఏళ్లుగా పూర్తి చేయకుండా నత్తనడకన నడిపిస్తున్నారని విమర్శించారు. అలాగే ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు ఆయా అభివృద్ధి పనుల కోసం 5,620 కోట్లు నిధులు వచ్చాయన్నారు. రాష్ట్ర వాటాతో నిధులు సమకూరాయని, కానీ నిజామాబాద్కు మాత్రం విస్మరించారన్నారు.

నిజామాబాద్ అర్బన్ లో 30 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ అటకెక్కిందని, స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు అసంపూర్తిగా మిగిలిపోయాయని చెప్పారు. కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఇలాగే కొనసాగితే బిజెపి పోరాటం ఉదృతం చేస్తుందన్నారు. వచ్చే వారంలో సీఎంని కలుస్తానని, స్పందించకపోతే తమ సత్తా చాటుతామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments