HomeTelanganaNizamabadటీపీసీసీ అధ్యక్షుడికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ..

టీపీసీసీ అధ్యక్షుడికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పి.ఆర్.టి.యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి, టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ సభ్యులు జి.వి. రామకృష్ణ, మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సిహెచ్. రాంభూపాల్‌లు ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

మహేష్ కుమార్ గౌడ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

తమను కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments