నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూదతావులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు రూ 35,000 నగదుతో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
