జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరిగిన మాజీ మంత్రి సతీమణి విజయారెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. బుధవారం నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న ఆయన.. విజయారెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, డీసీసీ అధ్యక్షులు భూపతిరెడ్డి (నగేష్ రెడ్డి), పలు ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విజయారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
