HomeCRIMEఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానం.సీసీ కెమెరాలతోనే గ్రామాల రక్షణగ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల...

ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానం.సీసీ కెమెరాలతోనే గ్రామాల రక్షణగ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.

‘మన ఊరు మన భద్రత.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం.

గ్రామాల్లో జరిగే అనుమానాస్పద కదలికలను, అసాంఘిక కార్యకలాపాలను వీటి ద్వారా సులభంగా గుర్తించి తక్షణ చర్యలు చేపట్టవచ్చు. నేరాల నివారణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ తమ సొంత రక్షణ కోసం, భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటును ఒక బాధ్యతగా తీసుకోవాలి.

ముఖ్యంగా నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా అని ఆయన అన్నారు. కెమెరాలను అమర్చుకోవాలి పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు.

గ్రామంలో భద్రత కోసం ముందుకొచ్చి 18 కెమెరాలను ఏర్పాటు చేయించిన బస్సాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సమయంలో గ్రామస్తులకు పలు అంశాలపై సీపీ అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. అలాగే, రైతులు పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టవద్దని.. దానికి బదులుగా మల్టీ పొటాషియం మందులను వాడితే భూసారం మెరుగవుతుందని రైతులకు హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్సై శైలేందర్, బస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, శ్రీరాంపూర్ సర్పంచ్ ఎర్రన్న, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments