HomeTelanganaNizamabadబీఆర్‌ఎస్‌ సభ్యత్వ సన్నాహకానికి భారీ స్పందన: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి...

బీఆర్‌ఎస్‌ సభ్యత్వ సన్నాహకానికి భారీ స్పందన: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి…

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం ఆర్మూర్‌లోని ఎస్‌ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకుల సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.

నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోందని, గల్లీగల్లీలో ‘మళ్లీ కారే కావాలి.. కేసీఆరే కావాలి’ అనే నినాదం మారుమోగుతోందని చెప్పారు. కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను వంచించిందని, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడపక రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.

జిల్లావ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ సేకరించాలని డిమాండ్ చేశారు. రైతుల తరఫున మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి అద్దం పడుతోందన్నారు.

ఆర్మూర్‌లో మైనర్ బాలిక ఘటనను పట్టించుకోకుండా రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజా సమస్యలపై మౌనం వహిస్తూ, హక్కుల కోసం పోరాడే వారిపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు.

గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి హామీని నిలబెట్టుకుని రైతన్న గుండెల్లో నిలిచిపోయిందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, నాయకులు వి.జి. గౌడ్, విఠల్ రావు, సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిశాంక్, విజయ భారతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments