హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో సీఐ ఓ వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు . ఇవాళ నాంపల్లిలోని సైబర్ క్రైమ్ బ్యూరో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఓ బాధితుడి ని రూ. 2 లక్షలు ఇవ్వాలని సైబర్ క్రైమ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ ఒత్తిడి చేసాడు దీనితో బాధితుడు నేరుగా ఏసీబీ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు దీనితో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు బాధితుడు నుంచి తన
కార్యాలయంలోనే సీఐ మహేందర్ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాంపల్లి సైబర్ క్రైమ్ కార్యాలయంలోనే సోదాలు కొనసాగుతున్నాయి.
సైబర్ నేరాల బారిన పడి విల విలాడే బాధితులకు ఊరట కలిగించి పోగొట్టుకున్న సొత్తు రికవరీ చేయడానికి ప్రభుత్వం సైబర్ క్రైం స్టేషన్ లను అందుబాటులోకి తెచ్చింది సాంకేతిక అనుభవం నైపుణ్యం ఉన్న అధికారులను ఈ విభాగం లో పోస్టింగ్ లుఇచ్చి సైబర్ నేరాలను నియంత్రిచే పని చేస్తుంది కానీ అక్కడా లంచగొండి అధికారుల ఉనికి ఏసీబీ దాడులతో వెలుగులోకి వచ్చింది
