నిజామాబాద్ జిల్లా మాక్లూర్లోని శ్రీ విట్ఠలేశ్వర రుక్మిణి దేవస్థానం, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం మరియు శ్రీ వీర హనుమాన్ స్వామి ఆలయాల నాల్గవ వార్షికోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ పార్టీ NRI గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ లు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.బిగాల సోదరుల ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ఆలయాల నాల్గవ వార్షికోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు బిగాల సోదరులు నిరంతరం కృషి చేస్తున్నారని భక్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
