HomeTelanganaNizamabadసింగరేణిలో అవినీతిపై నిజాలు బయటపెట్టాలి ... ఛలో సింగరేణిలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...

సింగరేణిలో అవినీతిపై నిజాలు బయటపెట్టాలి … ఛలో సింగరేణిలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…

సింగరేణిలో జరిగిన అవినీతిపై నిజాలు బయటపెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో మంచిర్యాల జిల్లాలో చేపట్టిన ఛలో సింగరేణి కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణి స్టాక్ రికార్డులో ఉన్నట్లు చూపిన సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కనిపించడం లేదని ఆరోపించారు. ఈ బొగ్గు విలువ సుమారు రూ.1600 కోట్లు ఉంటుందని , అక్రమంగా తరలించి విక్రయించారని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థకు భారీ నష్టం జరిగిందని వాపోయారు.

ఈ వ్యవహారంపై స్వతంత్ర లేదా ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, రవాణా, విక్రయాలపై పూర్తి ఆడిట్ నిర్వహించాలని అన్నారు. ప్రజల సంపదకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం జవాబుదారీతనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి సింగరేణి వ్యవహారంలో నిజం ఏదో ప్రజలకు తెలపాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలను తుంగలో తొక్కిందని గుర్తు చేశారు. దీనికి తోడు భారీ అవినీతికి పాల్పడడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. జైపూర్ థర్మల్, సోలార్ పవర్ ప్లాంట్ల పేరుతో పిపిఏ లు, డిపీఆర్ లు లేకుండానే భారీ అవినీతికి తెరలేపారన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో నచ్చిన కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు.

గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సింగరేణిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నాయని విమర్శించారు.

అయితే కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంత పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన తమని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకొని అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఖండించారు.

కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments