యోగా.సాధన తో ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు . యోగా… శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి పరిపూర్ణత అందించే మార్గం.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో శనివారం వన్ డే కౌంట్ డౌన్ యోగా పుష్కర వైభవం కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు
కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రసాద్ శుక్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ,ఎంపీలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు
