పాత కక్ష్య ల నేపథ్యంలో పాతబస్తీలోని దారుణ హత్య కలకలం రేపింది. రాజయ్యతోట ప్రాంతానికి చెందిన రాజు మేస్త్రి(45) అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నాగ అనే వ్యక్తి గ్రానైట్ రాయితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
సమాచారం అందుకున్న సంతోష్‌నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ప్రాథమిక విచారణలో వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం
