హైదరాబాద్‌లోని అబిడ్స్ (Abids) జగదీష్ మార్కెట్ లో అబిడ్స్ పోలీసులు సోదాలు చేసారు . ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీల పేర్లను తో నకిలీ ఫోన్ దందా గుట్టును రట్టు చేసారు .
ఈ తనిఖీల్లో భాగంగా వన్‌ప్లస్ (OnePlus) బ్రాండ్‌కు చెందిన భారీ మొత్తంలో నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్’ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు జగదీశ్ మార్కెట్‌లో రామ్ చౌదరి. పటేల్ మొబైల్స్ పేరుతో షాప్ నడుపుతున్నాడు.
అందులో ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్ ‘వన్ ప్లస్’ పేరుతో నకిలీ ప్రాడక్ట్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు షాపులోని రూ.12 లక్షలు విలువ చేసే నకిలీ వన్ ప్లస్ నెక్ బ్యాండ్స్, ఇయర్ పాడ్స్, ఛార్జర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్లను స్పాట్‌లోనే సీజ్ చేశారు.
ప్రాథమిక విచారణలో భాగంగా రామ్ చౌదరి గత కొంతకాలంగా వన్ ప్లస్ నకిలీ ప్రోడక్ట్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిపై పోలీసులు కాపీ రైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
