HomeCRIMEసైబర్ నేరాల డిజిటల్ అరెస్టు లపై దృష్టి పెట్టాలి .....ప్రధానమంత్రి

సైబర్ నేరాల డిజిటల్ అరెస్టు లపై దృష్టి పెట్టాలి …..ప్రధానమంత్రి

సైబర్ నేరాల డిజిటల్ అరెస్టు లపై దృష్టి పెట్టాలి …..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 52వ ప్రగతి (PRAGATI) సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డిజిపి ఆనంద్ లు వర్చువల్ గా పాల్గొన్నారు

సైబర్ నేరాలు మరియు “డిజిటల్ అరెస్ట్” మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని మోడీ కోరారు . సైబర్ ఆధారిత నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు,పోలీస్ ఏజెన్సీస్, బ్యాంకులు, డిజిటల్ ఇంటర్మీడియరీస్ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

సైబర్ నేరాల నివారణ, ఫిర్యాదుల స్వీకరణ, దర్యాప్తు చేసే విధానాలను మరింత బలోపేతం చేయలన్నారు ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు బాధితులకు సత్వర సహాయాన్ని అందించాలన్నారు సైబర్ నేరాల ఫిర్యాదుల తక్షణ నమోదు కోసం జీరో ఎఫ్ ఆర్ ఐ విధానాలను అమలు చేయాలన్నారు డిజిటల్ అరెస్ట్” మోసాలబారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడానికి నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు .

సైబర్ నేరాల పై పోరులో తెలంగాణ పోలీసులు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నారని ప్రధాని కితాబు ఇచ్చారు ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తెలంగాణ పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఆనంద్ పేర్కొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments