HomeCRIMEతెలంగాణ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

తెలంగాణ యూనివర్సిటీలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ ఆచార్య కె. లావణ్య విద్యార్థుల కు అవగాహన కార్యక్రమం, మరియు వివిధ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) సహకారంతో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించే వీడియోలను ప్రదర్శించి, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.

ఈ సందర్భంగా వీధి నాటిక, పోస్టర్ & నినాద రచన, షార్ట్ ఫిల్మ్, వాదోపవాదం, కవితా పోటీ, క్విజ్ తదితర పోటీలను నిర్వహించారు. విజేతలకు పతకాలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా నోడల్ అధికారి ప్రొఫెసర్ కరీమిండ్ల లావణ్య మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వ్యక్తి, కుటుంబం, సమాజ భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక దురాచారమని, యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకొని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవుపలికారు . ప్రతి విద్యార్థి సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చైతన్యవంతుడిగా మారాలని తోటి విద్యార్థులను మార్చాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ NSS కోఆర్డినేటర్ ఆచార్య కె. అపర్ణ, డా. ఎల్. జ్యోత్స్న, డా. కిరణ్ రాథోడ్, డా. గోపి రాజ్ తలారి, డా. నర్సయ్య డా. ఎన్. స్వామి, డా. గంగాకిషన్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థులందరిచే “డ్రగ్స్‌కు నో – జీవితానికి అవును ” అనే ప్రతిజ్ఞ చేయిoచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments