HomeTelanganaHyderabadపెద్దోళ్ల జోలికి వెళ్లే దైర్యం హైడ్రా కు లేదు .......బాధితుల పక్షాన ధర్నా చేసిన ఈటెల...

పెద్దోళ్ల జోలికి వెళ్లే దైర్యం హైడ్రా కు లేదు …….బాధితుల పక్షాన ధర్నా చేసిన ఈటెల ……..

విలువైన ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిజోలికి వెళ్లే దైర్యం హైడ్రా కు లేదని అందుకే పేదల ఇండ్ల మీద కూల్చేస్తున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు దమ్ముంటే పెద్దోళ్ళను జైల్లో పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వోట్లు అడగడానికి వచ్చే అధికార పార్టీ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు

ఆదివారం ఆయన బోయినపల్లి, అస్మత్‍పేటలో పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేతకు వ్యతిరేకంగా ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైడ్రాకు రాజకీయ నాయకుల పేరు ఎత్తే దమ్ము లేదన్నారు.

హైడ్రాకు కనికరం లేదని, పేదలు ఆర్తనాదాలు చేస్తున్నా వారి ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుందన్నారుహైడ్రా దొంగచాటున కూల్చివేత్తలకు పాల్పడుతోందని నిజంగా హైడ్రాకు దమ్ముంటే ఇది ప్రభుత్వ భూమా? కాదా ఎంక్వైయిరీ చేయాలన్నారు.

ప్రభుత్వ భూమిని ప్లాట్ లుగా చేసిన వారు ఎవరు? దీనికి సహకరించిన అధికారులు, రాజకీయ నాయకులు ఎవరో తేల్చి వారిని జైలుకు పంపించాలన్నారు. అది చేయకుండా నోరులేని పేదలపై ప్రతాపం చూపుతోందన్నారు. బాధితులు కోర్టుకు వెళ్లకుండా శనివారం, ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారన్నారు.

ఇలాగే కూల్చివేతలు కొనసాగిస్తే హైదరాబాద్ లో ఏ ఒక్క బస్తీ మిగలదన్నారు. మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అని ప్రశ్నించారు. పత్రాలు లేని పేదల భూములకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కూల్చివేత్తలు చేయడం ఏంటని ప్రశ్నించారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments