HomeLaw and Orderఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ స్థాయి నుండి హెడ్ కానిస్టేబుల్ హోదాకు పదోన్నతి పొందిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా సోమవారం కమిషనరేట్‌లో పదోన్నతి పొందిన జి.లింగం (పి.సి 1744, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), బి.శివకుమార్ గౌడ్ (పి.సి 265, రుద్రూర్ పోలీస్ స్టేషన్) లను ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

గత కొంతకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తమకు అవకాశం దక్కడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన కొత్త పదవిలో బాధ్యతలు చేపడుతున్న హెడ్ కానిస్టేబుళ్లు, రాబోయే రోజుల్లో మరింత అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments