ప్రమాదవశాత్తు రైలు నుంచి కింది పడి వ్యక్తి మృతి చెందాడు.బాసర-ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. శుక్రవారం ఉదయం 7.40 గంటల సమయంలో బాసర రైల్వే స్టేషన్ మేనేజర్ నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అంతకుముందు రోజు (జూలై 3) ఉదయం 7.30 గంటల లోపు, మృతుడు ఏదో గుర్తు తెలియని రైలులో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో 433/33-35 కిలోమీటరు వద్ద ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.ఘటనా స్థలంలో మృతుడిని గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ప్రస్తుతం రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎండీ మెహబూబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డిని 8712658591 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు.
