HomePOLITICAL NEWSఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.టిఆర్ ఎస్ వి నేత అభిలాష్ రెడ్డి వార్నింగ్

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.టిఆర్ ఎస్ వి నేత అభిలాష్ రెడ్డి వార్నింగ్

బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆశీస్సులతో ఆర్మూర్ నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన జీవన్ రెడ్డి మీద ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఉండబోమనిభారత రాష్ట్ర విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షడు అభిలాష్ రెడ్డి అన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇటీవల తమ నేత జీవన్ రెడ్డి మీద ఇష్టారీతిన మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు


ఆర్మూర్ ప్రజలు మాటలు కాదు… అభివృద్ధి పనులే కోరుకుంటున్నారని రాకేష్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చాడో ?తాము తెచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాకేష్ రెడ్డిని సవాల్ చేసారు


రాజకీయ విమర్శలు చేసే ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని రాకేష్ రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం మానుకుని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ నాయకత్వంలో ఆర్మూర్ నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వారు కూడా మాటలతో కాకుండా పనులతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.

జీవన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని, ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆర్మూర్ అభివృద్ధి కోసం ఎవరు ఎంత నిధులు తీసుకువచ్చారో బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అదే ధైర్యం రాకేష్ రెడ్డికి ఉంటే తేదీ, వేదిక ప్రకటించాలని అభిలాష్ రెడ్డి సవాల్ విసిరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments