మాజీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ పేరు పై కేంద్ర ఎన్నికల సంఘం .
కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె కొత్తగా పెట్టబోయే పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు, దీనిపై నిబంధనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు స్వీకరించింది.
ఈ నేపథ్యంలోఆమె ప్రతిపాదించిన పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు అధికారికంగా లేఖ రాశారు.
రాబోయే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించక పోతే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ గడువు విధించినట్లు తెలుస్తోంది..కవిత చెప్పిన టిఆర్ యస్ విషయంలో వందలాది గా పిర్యాదు లు నమోదు అయిన నేపథ్యంలో కమిషన్ ఈ చర్యలు తీసుకుంది.
///// న్యాయ పోరాటం చేస్తాం …..కవిత ////
ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వ్యూల ఫై కవిత మాట్లాడారు తాము మరో రెండు పేర్లను ప్రతిపాదించే ప్రసక్తే లేదని ముందుగా ఇచ్చిన పేరు మీద రాజకీయ పార్టీ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు తాము న్యాయ స్థానం ను ఆశ్రయించిస్తామన్నారు.
