HomeTelanganaNizamabadఇంచార్జ్ మంత్రి జిల్లాకు చుట్టపు చూపేనా ..........అభివృద్ధి సంక్షేమాలను సమీక్షించేవారేలేరా .......

ఇంచార్జ్ మంత్రి జిల్లాకు చుట్టపు చూపేనా ……….అభివృద్ధి సంక్షేమాలను సమీక్షించేవారేలేరా …….

జిల్లా అభివృద్ధి ఫై యంత్రాంగానికి దిశానిర్దేశం చేసే నాధుడే లేకుండా పోయారు. అందుకే అధికారులు ఎవరికి వారే యమునా తీరున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.మంత్రి వర్గం లో ఎలాగో జిల్లాకు ప్రాతినిధ్యమే లేదు.

కనీసం ఇంచార్జ్ మంత్రి అయినా పట్టించుకుంటారనుకుంటే ఆమె జిల్లాకు చుట్టపు చూపుగా మారిపోయారు. దిగ్గజ నేతల జిల్లా లో ఇంచార్జ్ మంత్రి నా మాత్రంగా వ్యవహరిస్తున్నారు.

జిల్లా వ్యవహారాల విషయంలో ఆమె తనకేమీ పట్టనట్లుగా వుంటున్నారు నిజానికి ఉమ్మడి జిల్లాలో తొమ్మది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అయిదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వారే ఎమ్మెల్యే లుగా ఉన్నారు.

సామాజిక సమీకరణ ల నేపథ్యంలో జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు.తదుపరి విస్తరణలో ఛాన్స్ వుంటుందని చెప్తున్నారు. కానీ ఆ విస్తరణ ఎప్పుడు వుంటుందో స్పష్టత లేదు.పీసీసీ చీఫ్ సొంత జిల్లా విషయంలోనే కాంగ్రెస్ అధిష్టానం నిర్లిప్తంగా ఉండడం ఫై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేక పోవడంతో ఏకంగా ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులుగా నియామకం అయ్యారు. వారుకూడా తమ నియోకవర్గాలకే పరిమితం అయి పనిచేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ లో మొదట జూపల్లి కృష్ణారావు ఇంచార్జ్ మంత్రిగా ఏడాదిన్నర కాలం పనిచేసారు ఆయన కూడా హైదారాబాద్ కే పరిమితం అయ్యారు జస్ట్ మూడే సార్లు జిల్లాకు వచ్చారు ఎదో మొక్కుబడిగా రివ్యూలు చేసి జారుకునేది ఆయన తర్వాత పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ను ఇంచార్జ్ మంత్రిగా నియామకం అయ్యారు ఆమె దాదాపు ఏడాది కాలం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కొనసాగుతున్నారు సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు ముందే ఆమె నియామకం అయ్యారు.

ఇప్పటిదాకా రెండే సార్లు రివ్యూ సమావేశాలు నిర్వహించారు అవికూడా మొక్కుబడి తంతు గానే సాగాయి. చాల కాలం తర్వాత జిల్లాకు శనివారం వస్తున్నారు కేవలం మూడే గంటలో టూర్ ముగించుకొని సొంత జిల్లాకు వెళ్లేలా పోగ్రామ్ ఖరారు చేశారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో అధికారులతో కనీసం గంటైనా రివ్యూ చేసే పరిస్థితి లేదు.

ప్రతియేటా ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధిగా ఆయా పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయి అభివృద్ధి పనులు పురోగతి ఎలా వుందనేది? ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అధికారులను మరింత ఉత్తేజంగా పారదర్శకంగా పనిచేసేలా మంత్రి గా దిశానిర్దేశం చేయాలి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments