HomeCRIMEఏసీబీ దూకుడు కు బ్రేక్ పడ్డట్లేనా .......బీమ్ రెడ్డి కేసులో ఫలించిన పాలమూరు నేత ఒత్తిడి...

ఏసీబీ దూకుడు కు బ్రేక్ పడ్డట్లేనా …….బీమ్ రెడ్డి కేసులో ఫలించిన పాలమూరు నేత ఒత్తిడి ………బీమ్ రెడ్డి అరెస్టు ఫై సాగుతున్న హై డ్రామా..

అవినీతి అధికారులను వేటాడి వెంటాడుతున్న ఏసీబీ దూకుడు కు ఎట్టకేలకు బ్రేక్ పడింది. చారుసిన్హా ఏసీబీ బాధ్యతలో వచ్చాక వరుస దాడులతో ఉన్నతస్థాయి అధికారుల వెన్నులో వణుకు పుట్టించారనే వాదన ఉంది. ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌‌‌‌రెడ్డి అరెస్ట్‌‌‌‌ వ్యవహారం ఏసీబీ ప్రతిష్ట నే మసక బారేలా చేస్తుంది..

అరెస్టు వ్యవహారంలో ఏసీబీ ఆడుతున్న హైడ్రామ ఫై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి గతంలో ఇలాంటి ప్రతి కేసులోనూ అవినీతి అధికారులను అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌ తరలించిన ఏసీబీ.. భీమ్‌‌‌‌రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ కు చెందిన భీమ్‌‌‌‌రెడ్డి కోసం అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక నేత తెరవెనుక చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతుంది.

ఓడిపోయిన నేత కు బీమ్ రెడ్డి సమీప బంధువు కావడంతో సదరు నేత నేరుగా ప్రభుత్వ పెద్దలను ఒత్తిడి చేసి సక్సెస్ అయినట్లుగా చెప్తున్నారు.గురువారం మధ్యాహ్నం ఏసీబీ సోదాల సమయంలో హైబీపీ కారణంగా భీమ్రెడ్డి అస్వస్థతకు గురయ్యారని, దీంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.

డాక్టర్ల సూచనల మేరకు భీమ్‌‌‌‌రెడ్డిని హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్ చేశామని, డిశ్చార్జ్‌‌‌‌ అనంతరం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని  ఓ ఉన్నతాధికారి చెప్తున్న వివరణ సైతం హాస్యా స్పదంగా ఉంది ఇటీవలే ఆయా ప్రభుత్వ శాఖల్లో అత్యున్నత అధికారులను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు లు చేసిన ఏసీబీ తెలంగాణ ‘పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్’ (PCS) డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డి అరెస్టు విషయంలో మీన మేషాలు లెక్కించడం వెనుక బలమైన ఒత్తిళ్లే పనిచేశాయని చెప్తున్నారు . ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.

ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మరో 15 ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు ఆయన ఆస్తులు లెక్కగట్టి ఏసీబీ అధికారులే అలిసి పోయారు.

1.)హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా. 2) టెలికాం నగర్‌లో ఒక జి+2+పెంట్ హౌస్ నివాసం. 3) టెలికాం నగర్‌లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్. 4) గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్. 5). మణికొండ లంకోహిల్స్ రోడ్‌లోని జి+5 కమర్షియల్ కాంప్లెక్స్‌లో 500 చదరపు గజాల వాటా. 6) మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్. 7). తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు నివాస ఫ్లాట్లు. 8). ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఓపెన్ ప్లాట్. 9) . సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి. 10) కర్ణాటకలో 6 ఎకరాలు మరియు మరొక చోట 38 ఎకరాల వ్యవసాయ భూమి. 11) . బెంగళూరు దేవనహళ్లిలో 1 ఎకరం భూమి. 12). నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్. 13.)పటాన్‌చెరు జిపిఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాలు, మరియు పటాన్‌చెరులో మరొక 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్లు. 14). వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 1000 చదరపు గజాల భూమి మరియు 2 ఎకరాల వ్యవసాయ భూమీ 15). మెసర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ. 75,00,000/- పెట్టుబడి. 16) సిసి కుంట మండలం ముచింతల గ్రామంలో 4 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి. ఇంట్లో సుమారు రూ. 3.60 లక్షలు, మరియు ఆయన బినామీ ఇంట్లో లభించిన మరో రూ. 40 లక్షల నగదుసుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు మరియు 20 కిలోల వెండి వస్తువులు సుమారు రూ. 19 లక్షల 91 వేల బ్యాంక్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments