HomeCRIMEనేరాల నియంత్రణ కోసం కృషి చేయాలి....నిఘా వ్యవస్థ ను పటిష్ట పర్చాలి......విజిబుల్ పోలీసింగ్ తప్పనిసరి.బాసర జోన్...

నేరాల నియంత్రణ కోసం కృషి చేయాలి….నిఘా వ్యవస్థ ను పటిష్ట పర్చాలి……విజిబుల్ పోలీసింగ్ తప్పనిసరి.బాసర జోన్ డిఐజి

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలని , మహిళలు , చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని బాసర జోన్ డిఐజి భాస్కరన్ ఆదేశించారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా , విక్రయాలు , వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

ఆయన శనివారం నిజామాబాదు పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ యందు సమీక్షా సమావేశం నిర్వహించారు నిర్మల్ , ఆదిలాబాద్ , జగిత్యాల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం అయ్యారు ప్రజలకు అందుబాటులో ఉండే స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని , ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని డీఐజీ పేర్కొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలని , ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు , సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల పోలీసు అధికారులు , యూనిట్ ఇన్‌చార్జ్‌లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని తమ జిల్లాలకు సంబంధించిన పనితీరు , నేర నియంత్రణ చర్యలు , ఎదురవుతున్న సమస్యలు మరియు చేపట్టాల్సిన కార్యాచరణపై డీఐజీ కి వివరించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీమతి డాక్టర్ జి. జానకి షర్మిల,., ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్,జగిత్యాల్ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, మరియు అదనపు ఎస్పీలు , ఏసీపీలు , సిఐలు , రిజర్వ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments