HomePOLITICAL NEWSకన్నెపల్లి వెళ్తున్న కేటీఆర్ ....అడ్డుకున్న పోలీసులు

కన్నెపల్లి వెళ్తున్న కేటీఆర్ ….అడ్డుకున్న పోలీసులు

కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు హైదరాబాద్ నుండి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి కేటీఆర్‌ను కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది.. హైదరాబాద్-వరంగల్ హైవే మీద పోలీసులు భారీగా మోహరించారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతుల వాహనాలను అడ్డుకుంటున్నారు.

మరోవైపు కేటీఆర్ పర్యటనకు వెళ్లకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.

పోలీసులు అడ్డుకున్నారు.కేటీఆర్ తో బిఆర్ యస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఒడితల సతీష్ కుమార్, చల్లా ధర్మారెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments