ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థిని, విద్యార్థులకు ఫీజుల బకాయిల పేరిట సర్టిఫెక్ట్ లు ఇవ్వకుండా వేధిస్తే ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమలపూడి రవికుమార్ హెచ్చరించారు.
గత మార్చి వార్షిక, మే సప్లిమెంటరీ పరీక్షలలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థిని, విద్యార్థులు పై చదువుల కోసం వారికి ఇవ్వాల్సిన టీ.సీ. లు, బోనోఫైడ్ ఇతర ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి ఇబ్బందులకు గురి చేసే కళాశాల యాజమాన్యాల పై బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థిని, విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తే జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు కళాశాలల పై ఇంటర్ బోర్డు కు నివేదిస్తామనీ జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు.
